: లక్ష్యం దిశగా మరో అడుగు పడింది!: తెలంగాణ మంత్రి కేటీఆర్
విశ్వనగరంగా హైదరాబాద్‌ను నిలబెట్టే లక్ష్యంలో మరో ముందడుగు వేశామని తెలంగాణ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించిన 21 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డును ఈ రోజు కేటీఆర్ ప్రారంభించారు. ఈ రోడ్డు నగరానికే తలమానికమని ఆయన పేర్కొన్నారు. రింగ్ రోడ్డుని పూర్తి స్థాయిలో నేటి నుంచి ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్పారు. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా 30 కోట్ల రూపాయలతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు వ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.