: ‘ప్ర‌తిరోజు వేయి మంది’.. కలరా, వైరల్ జ్వరాలతో ఫీవర్ ఆసుపత్రికి క్యూ క‌డుతోన్న రోగులు


హైదరాబాద్‌లో కలరా, వైరల్ జ్వరాలు విజృంభించాయి. న‌ల్ల‌కుంట ఫీవ‌ర్ ఆసుప‌త్రిలో ఔట్ పేషెంట్ విభాగం రోగులతో నిండిపోతోంది. వ‌ర్షాకాలం ఆరంభంలో అధిక సంఖ్య‌లో రోగులు ఆసుప‌త్రికి క్యూ క‌డుతున్నారు. ప్ర‌తిరోజు వేయి మంది రోగులు జ్వరాల‌తో ఓపీ విభాగంలో చికిత్స కోసం వ‌స్తున్న‌ట్లు ఆసుప‌త్రి సూపరింటెండెంట్ శేఖర్ ఈరోజు మీడియాకు తెలిపారు. క‌ల‌రా, వైర‌ల్ జ్వరాలతో ఆసుప‌త్రికి వ‌స్తోన్న రోగుల సంఖ్య పెరిగిపోతోంద‌ని ఆయ‌న చెప్పారు. వాటితో పాటు డెంగ్యూ కేసులూ అధికంగానే న‌మోద‌వుతున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News