: ఈసారి అఖిలేషే టార్గెట్.. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్నోలో బీజేపీ ఆందోళన.. ఉద్రిక్తత


భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వ తీరుకి నిర‌స‌న‌గా ఆందోళ‌నలు చేసే ఘ‌ట‌న‌లు త‌రుచూ క‌నిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి లక్నోలో పెద్ద ఎత్తున బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ ప్ర‌భుత్వ తీరుకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని, అఖిలేష్ నేరాల‌ను అరిక‌ట్ట‌లేక‌పోతున్నార‌ని బీజీపీ కార్య‌క‌ర్త‌లు ఆరోపించారు. ఆందోళ‌నకారులపై పోలీసులు వాట‌ర్ కెనాన్లు ప్ర‌యోగించారు. వారిని చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు.

  • Loading...

More Telugu News