: ‘కబాలి’లో రజనీ పర్ఫామ్మెన్స్ అదిరిపోయింది: గాయకుడు మనో
‘కబాలి’లో రజనీకాంత్ పర్ఫామ్మెన్స్ చూసి ముగ్ధుడినైపోయానని, అదిరిపోయేలా నటించారని ప్రముఖ గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రజనీ కాంత్ నటించిన చాలా సినిమాల్లో ఆయనకు డబ్బింగ్ చెప్పానని, అయితే, ‘కబాలి’ మాత్రం చాలా ప్రత్యేకమని అన్నారు. రజనీకాంత్ నటించిన ఏ సినిమాకైనా తెలుగులో డబ్బింగ్ చెప్పే అవకాశం తనకు లభిస్తుందని, తద్వారా ఆయా చిత్రాలను ముందుగానే చూసే అవకాశం తనకు దొరుకుతుందని, అదే క్రమంలో ‘కబాలి’కి కూడా డబ్బింగ్ చెప్పానని అన్నారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ‘కబాలి’ సినిమా చూశానని, రజనీ కాంత్ స్టైల్ చూస్తుంటే ఆ వయస్సులో ప్రతివారూ అలా ఉండాలనిపించేలా ఉంటుందని మనో అన్నారు. ఒక్క ఫ్రేమ్ లో కూడా ఆయన స్టైల్ మారలేదని మనో చెప్పారు.