: కలుస్తారో?... లేదో?: నేడు హస్తినకు తెలుగు రాష్ట్రాల సీఎంలు!


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ఇద్దరూ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగనున్న అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరయ్యేందుకే వీరిద్దరూ ఢిల్లీ వెళుతున్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న చంద్రబాబు నిన్న రాత్రి తన విదేశీ పర్యటనను ముగించుకుని నేటి ఉదయానికి విజయవాడ రానున్నారు. ఇక హైదరాబాదులోనే ఉన్న కేసీఆర్ నేడు నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. ఒకరోజు ముందుగానే ఢిల్లీ వెళుతున్న కేసీఆర్... నేడు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టం హామీల అమలు తదితరాలపై కేంద్ర మంత్రుల వద్ద కేసీఆర్ ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇరు రాష్ట్రాల మధ్య పలు సమస్యలపై పెను వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒకేసారి ఢిల్లీ వెళుతున్న వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయి సదరు వివాదాల పరిష్కారంపై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరి హస్తిన పర్యటనపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News