: విజయం కావాలంటే ఓపిక కావాలి: అశ్విన్
వెస్టిండీస్ పిచ్ లపై విజయవంతం కావాలంటే ఓపిక అవసరమని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. సెయింట్ కీట్స్ లో మీడియాతో అశ్విన్ మాట్లాడుతూ, వెస్టిండీస్ లో బౌలింగ్ చేయడం చాలా కష్టమైన అంశమని పేర్కొన్నాడు. బౌలింగ్ చేయడం చాలా విసుగు తెప్పిస్తుందన్నాడు. అయితే విసుగును పక్కనబెడితే వికెట్లు సాధించడం కష్టం కాదని చెప్పాడు. అందుకే ఓపిగ్గా బౌలింగ్ చేయాలని పేర్కొన్నాడు. స్లో ట్రాక్ లపై బౌలింగ్ చేయాలంటే బోర్ కొడుతుందని, ఓపిక నశిస్తే ఫెయిల్ అవుతామని, ఓపిగ్గా లైన్ అండ్ లెంగ్త్ ను నమ్ముకుంటే విజయం సాధించడం కష్టం కాదని అశ్విన్ తెలిపాడు. కాగా, అశ్విన్ పై టీమిండియా కోచ్ కుంబ్లే భారీ ఆశలు పెట్టుకున్నాడు.