: అరుదైన ద్రాక్ష.. మన కరెన్సీలో ఆ ద్రాక్ష పండు ఖరీదు రూ.25 వేలు


జపాన్ లో అత్యంత అరుదుగా లభించే రూబీ రోమన్ రకానికి చెందిన ద్రాక్షపండ్ల ఖరీదు అంతాఇంతా కాదు. ఒక్క ద్రాక్ష పండు ధరే మన కరెన్సీలో రూ.25 వేలు ఉంటుంది. ఇంత ఖరీదు పెట్టి ఎవరు కొనుక్కుతింటారనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే, ఖరీదైన, అరుదైన పండ్లను కొనుగోలు చేయడాన్ని ఎంతో హోదాగా జపనీస్ భావిస్తుంటారు. అందుకని, అటువంటి పండ్లు అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయట. కోనిషి అనే పండ్ల దుకాణదారుడు అరుదైన రూబీ రోమన్ రకపు ద్రాక్ష గుత్తిని 1.1 మిలియన్ యెన్లు అంటే మన కరెన్సీలో సుమారు 7.35 లక్షలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడు. అయితే ఈ గుత్తిలో వున్నవి కేవలం 30 ద్రాక్ష పండ్లు మాత్రమే. రూబీ రోమన్ ద్రాక్ష ప్రత్యేకతల విషయానికొస్తే... ప్రత్యేక పరిస్థితుల్లో, పలు నూతన పద్ధతుల్లో ఈ పంట పండిస్తుంటారు. చక్కెర 18 శాతం వరకు ఉండే ఒక్కో ద్రాక్ష పండు 20 గ్రాముల బరువు తూగుతుంది. 1992 నుంచి జపాన్ తీరప్రాంతం ఇషికవలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే, 2008 నుంచి వినియోగంలోకి వచ్చిన ఈ పండ్ల ధర ప్రతి ఏటా పెరుగుతుండటం గమనార్హం. ఈ ద్రాక్షకు ఎంత డిమాండంటే ఒక్కోసారి వేలం పాట కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా నిర్వహించిన వేలం పాటలోనే కోనిషి ఈ అరుదైన ద్రాక్ష గుత్తిని అంత రేటు వెచ్చించి సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News