: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో అవార్డు... డిజిటలైజేషన్ లో ప్రథమ స్థానం కైవసం!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటలైజేషన్ రంగంలో ప్రథమస్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల్లో వివిధ కేటగిరీల్లో కేంద్రం ఈరోజు అవార్డులను ఇచ్చింది. దీంట్లో డిజిటలైజేషన్ రంగంలో అవార్డుని సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. ఏపీ ఐటీశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఈరోజు ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రద్యుమ్నకి ఈ అవార్డును ప్రదానం చేశారు.