: ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం కీలక ప్రకటన చేసిన కాంగ్రెస్!


ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీలో నిలవనున్నారని కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో పార్టీ ప్రచార బాధ్యతల సారథ్యాన్ని అందరూ ఊహించినట్టు ప్రియాంకా గాంధీకి కాకుండా సంజయ్ సింగ్ కు అప్పగిస్తున్నట్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా తమ వ్యూహాలు ఉంటాయని ఈ సందర్భంగా ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. కాగా, యూపీలో విజయం సాధించాలంటే బ్రాహ్మణ వర్గం నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ సూచించినట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షీలా దీక్షిత్ పేరు వినిపిస్తూనే ఉండగా, ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడింది.

  • Loading...

More Telugu News