: వారసత్వ రాజకీయాలకు ఆప్ వ్యతిరేకం...కేజ్రీవాల్ భార్య రాజకీయాల్లోకి రారు: ఆప్ ప్రకటన
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య (సునీత) రాజకీయాల్లోకి రారని ఆప్ స్పష్టం చేసింది. వారసత్వ రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య పదవీ విరమణపై సోషల్ మీడియాలో పలు ఆరోపణలు వెలుగు చూస్తున్న తరుణంలో ఆమె రాజకీయాల్లోకి రారని ఆప్ స్పష్టం చేసింది. పదవికి రాజీనామా చేసిన ఆమె గోవా, లేదా పంజాబ్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ మేరకు చేసిన ప్రకటనలో ఆప్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని వెల్లడించింది. అలాగే ఒకే కుటుంబంలోని ఇద్దరు పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో సభ్యత్వం పొందేందుకు అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గోవా, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆమె పాలుపంచుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని తెలిపారు.