: ఇవ్వాల్సిన డబ్బు వెంటనే ఇవ్వండి: బీసీసీఐపై మండిపడ్డ ముత్తయ్య మురళీధరన్


శ్రీలంక ఆటగాళ్లకు బీసీసీఐ బకాయి ఉన్న కోట్లాది రూపాయలను వెంటనే చెల్లించాలని స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ డిమాండ్ చేశాడు. తనకు రూ. 2.5 కోట్లు ఇవ్వాల్సి వుందని, మహేల జయవర్ధనేకు రూ. 3 కోట్ల వరకూ రావాల్సి వుందని ఆయన గుర్తు చేశాడు. పలుమార్లు బీసీసీఐ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినా పట్టించుకోలేదని విమర్శించాడు. తాను ఎన్నో దేశాల్లో లీగ్ మ్యాచ్ లు ఆడానని, బీసీసీఐలా ఎలాంటి బోర్డూ వ్యవహరించలేదని దుయ్యబట్టాడు. ఆటగాళ్లతో కుదుర్చుకున్న కాంట్రాక్టులను బోర్డు గౌరవించడం లేదని అన్నారు. మరోపక్క, గత సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో గాయపడ్డ మహ్మద్ సమీకి రూ. 2.23 కోట్ల పరిహారాన్ని బీసీసీఐ ఇచ్చిన తరువాత, మిగతా గాయపడ్డ వారంతా కూడా పరిహారానికి ఒత్తిడి తెస్తున్నారు.

  • Loading...

More Telugu News