: 26న విచారణకు రావాలని షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు


వాటర్ ట్యాంకర్ల కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఆమెను వచ్చే నెల 26న విచారణకు రావాల్సిందిగా కోరినట్టు ఏసీబీ చీఫ్ ఎంకే మీనా వెల్లడించారు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వేళ, షీల వాటర్ బోర్డు చైర్మన్ గా కూడా ఉన్నారు. అప్పట్లో ట్యాంకర్ల కొనుగోలు వెనుక అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కేజ్రీవాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసును విచారిస్తున్న ఏసీబీ, సంబంధిత అధికారులందరినీ ప్రశ్నించి పలు కీలక ఆధారాలు సంపాదించింది. తాజాగా షీలాను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. కాగా, ఉత్తరప్రదేశ్ కు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ, ఆమెకు ఏసీబీ నోటీసులు వెళ్లడం గమనార్హం.

  • Loading...

More Telugu News