: ఇకపై తెలంగాణలో వినాయక నిమజ్జనానికి ప్రత్యేక కొలను


తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వినాయక నిమజ్జనానికి ప్రత్యేక కొలను ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు తరహాలో నిమజ్జన కొలనును అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. రూ.4.90 కోట్లతో చేపట్టిన చర్లపల్లి చెరువు సుందరీకరణ పనులు, రూ.60 లక్షలతో చేపట్టిన గణేష్ నిమజ్జన కొలనును హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. కాగా, తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో వినాయక చవితికి భారీ విగ్రహాలు ఏర్పాటు చేసి, ఉత్సవాలు నిర్వహించడం... చివర్లో ఆ వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించడమనేది అదో పెద్ద ఘట్టం.

  • Loading...

More Telugu News