: లేడీ ఫైటర్ గా సోనాక్షి సిన్హా!... ‘అకీరా’ స్టంట్స్ లో బాలీవుడ్ బ్యూటీకి గాయాలు!


బాలీవుడ్ లో లేడీ ఫైటర్లుగా మారుతున్న అందాల తారల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే మల్ల యుద్ధ విన్యాసాలతో ‘సుల్తాన్’లో అనుష్క శర్మ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా బాలీవుడ్ కే చెందిన మరో స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా లేడీ ఫైటర్ అవతారం ఎత్తుతోంది. సోనాక్షి లీడ్ రోల్ గా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘అకీరా’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా కొన్ని ఫైటింగ్ సన్నివేశాల్లో పాల్గొన్న సోనాక్షికి స్వల్ప గాయాలయ్యాయట. ఈ మేరకు ఈ విషయాన్ని సోనాక్షినే స్వయంగా వెల్లడించింది.

  • Loading...

More Telugu News