: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. కుక్కల దాడిలో పదేళ్ల బాలిక స్పందన మృతి
వీధి కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతోన్న ఘటనలు నిత్యం జరుగుతూనే వున్నా వాటిని అధికారులు ఏ మాత్రం అరికట్టలేక పోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు అటువంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. జిల్లాలోని పొందూరు మండలం దళ్లిపేటలో కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో పదేళ్ల బాలిక స్పందన దారుణంగా మృతి చెందింది. చిన్నారి మృతి పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు కుక్కల స్వైర విహారంపై పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.