: భారతరత్న అబ్దుల్ కలాం సమాధికి స్థలం కూడా ఇవ్వని అమ్మ సర్కారు!


మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం స్మారక మండప నిర్మాణం ఇప్పటికీ మొదలు కాలేదు. తమిళనాట జయ సర్కారు స్థలం కేటాయించకపోవడమే ఇందుకు కారణమని, స్మారక మండపాన్ని డిజైన్ చేసిన కేంద్ర ఆర్కిటెక్ ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం ఇదే నెల 27వ తేదీన షిల్లాంగ్ లోని ఓ సదస్సులో పాల్గొన్న ఆయన, వేదికపైనే కుప్పకూలి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన స్వగ్రామమైన రామేశ్వరం సమీపంలోని పేకరంబు వద్ద అంత్యక్రియలు జరిగాయి. ఇక్కడే కలాం స్మారక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తొలి వర్ధంతికి గడువు దగ్గరపడుతున్నప్పటికీ, నిర్మాణం మాత్రం మొదలు పెట్టలేదు. ప్రస్తుతం 1.5 ఎకరాల స్థలముండగా, అదనపు స్థలం కోరుతూ కేంద్ర సైనిక పరిశోధన అభివృద్ధి శాఖ, జయలలిత సర్కారును ఎన్నిమార్లు కోరినా పట్టించుకోలేదు. ఇక్కడ చిన్నారుల కోసం పార్కు, ఎగ్జిబిషన్ హాలు, సిబ్బంది గదులు నిర్మించాలంటే, మరింత స్థలం అవసరమని ఇంజనీర్లు అంటున్నారు.

  • Loading...

More Telugu News