: మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వాగ్వాదం


ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కల మధ్య వాగ్వాదం జరిగింది. బనిగండ్లపాడు నుంచి బంజార వరకు రూ.4.70 కోట్ల వ్యయంతో రోడ్లు పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు గులాబీ రంగులు వేయవద్దంటూ తుమ్మలతో భట్టి వాగ్వాదానికి దిగారు. దీంతో, అక్కడే ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కల్పించుకుని వారికి సర్దిచెప్పారు.

  • Loading...

More Telugu News