: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 2,118 పోస్టుల భర్తీ: వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన


వైద్య విద్య పూర్తి చేసిన తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 2,118 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విద్య సంచాలకులు, ప్రజారోగ్య విభాగం, వైద్య విధాన పరిషత్‌ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఈ ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News