: నా బిడ్డను ఎందుకు చంపావ్ రా...?: కోర్టులో టెక్కీ స్వాతి తండ్రి ఉద్వేగం
తమిళనాట కలకలం రేపిన స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ కు నిన్న కూడా చెన్నై మెజిస్ట్రేట్ దోష నిర్థారణ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణ సమయంలో కోర్టు హాలులో రామ్ కుమార్ ని చూసిన స్వాతి తండ్రిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో న్యాయస్థాన పరిసరాలను కూడా లెక్కచేయకుండా "అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డను నువ్వే చంపావ్" అంటూ రామ్ కుమార్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. "ఎందుకు చంపావ్ రా! స్వాతిని" అంటూ ఆయన కన్నీరు మున్నీరు కావడంతో అక్కడున్న వారందరూ చలించిపోయారు. 'స్వాతిని చంపడం వల్ల శిక్ష నీకు కాదురా, నాకు...' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యకు నిందితుడు రామ్ కుమార్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు.