: కాశ్మీరీ పండిట్ల హృదయ విదారక దృశ్యాలను అప్ లోడ్ చేసిన అనుపమ్ ఖేర్!


బాలీవుడ్ వెటరన్ స్టార్ అనుపమ్ ఖేర్ సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేసిన చిత్రాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. కాశ్మీరులో పండిట్లను (బ్రాహ్మణులు) ఉగ్రవాదులు ఊచకోత కోసిన తరువాత తీసిన పలు చిత్రాలను అనుపమ్ పోస్టు చేశారు. చిన్నా, పెద్దా, ఆడా మగా తేడా లేకుండా నిర్దయగా దాడులు చేసిన ఈ ఫోటోలను చూస్తే, కాశ్మీర్ లో గతంలో ఉన్న పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. టెర్రరిస్టులు చంపేసిన కాశ్మీరీ పండిట్ల మృతదేహాలివని, సూడో లిబరల్స్ వీటిపై స్పందించనే లేదని అన్నారు. గత వారాంతంలో 22 ఏళ్ల కాశ్మీరీ టెర్రరిస్ట్ బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ ఘటనను వ్యతిరేకిస్తూ, భారీ ఎత్తున హింస జరుగుతున్న వేళ అనుపమ్ ఈ చిత్రాలను తెరపైకి తేవడం గమనార్హం. కాగా, చూస్తేనే హృదయం ద్రవించిపోయేలా ఉన్న ఈ ఫోటోలను ప్రచురించలేకపోతున్నాం.

  • Loading...

More Telugu News