: వరద ఎఫెక్ట్!... నిలిచిన పోలవరం పనులు!
ఎడతెరిపి లేని వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి గోదావరి నదికి పోటెత్తిన వరద ఫలితంగా జాతీయ ప్రాజెక్టు పోలవరం పనులు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షంతో గోదావరికి పోటెత్తిన వరద అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పనులు నిలిచిపోయాయి. అసలే అంతంత మాత్రం వేగంతో సాగుతున్న పోలవరం పనులకు వరద పూర్తిగా బ్రేకులేసేసింది. వరద నీరు పూర్తిగా తొలగిపోతే తప్పించి తిరిగి పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.