: విజయవాడ నగరపాలక సంస్థ అధికారిపై అత్యాచారయత్నం ఆరోపణలు
విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన 'డీఎస్ వో' రమేష్ తనపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది. జనన ధ్రువీకరణ పత్రంలో తప్పులు సవరించుకుందామని వెళ్లిన తనపై రమేష్ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని చెప్పిన రమేష్ ను, అందరి మధ్యలోనే సదరు మహిళ దేహశుద్ధి చేసింది.