: గొర్రెలకు కాపలా కాస్తున్న సింహం!


మేకలు, గొర్రెలు... కనపడితే వాటిపై దాడి చేసి, ఆహారంగా చేసుకునే సింహాల గురించి అందరికీ తెలుసు. కానీ, ఆ గొర్రెలకు కాపలా కాస్తూవుండే ఓ సింహం సంగతులు ఇవి. రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ డగెస్థాన్ కి చెందిన బెరంబెక్ రహిమొవ్ కి కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపేందుకు ప్రతిరోజూ అడవికి తీసుకువెళుతుంటాడు. అయితే, గొర్రెలతో పాటు ఒక సింహాన్ని కూడా అతను అడవికి తీసుకువెళ్లేవాడు. ఆ సింహం గొర్రెలకు కాపలా ఉండటమే కాకుండా, ఇతర క్రూర జంతువుల నుంచి వీటికి ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తోంది. అయితే, బెరంబెక్ కు ఈ సింహం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అతని స్నేహితుడు దీనిని పసికూనగా ఉన్నప్పుడు బహుమతిగా ఇచ్చాడు. ఆ సింహానికి ‘మాష’ అని పేరుపెట్టి.. గొర్రెలతో పాటే దానిని కూడా పెంచి పెద్ద చేశాడు. దీంతో, ఆ గొర్రెల మందను చూస్తే ‘మాష’కు దాడి చేయాలనిపించకపోవడమే కాకుండా వాటికి రక్షణగా కూడా నిలుస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News