: గోవు చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ కారుకి కట్టేసి కొట్టిన వైనం
హిందువులు పవిత్రంగా భావించే గోవు చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్‌లో నలుగురు అనుమానిత యువకులను గోవు సంరక్షణ సంస్థ సభ్యులు చితక్కొట్టారు. నలుగురు యువకులను పట్టుకున్న గోవు సంరక్షణ సంస్థ సభ్యులు వారిని అర్ధనగ్నంగా మార్చి, ఓ కారుకి వారి చేతులని కట్టేశారు. ఆపై అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై యువకుల శరీరం వెనుకభాగం, కాళ్లపై రాడు లాంటి పరికరంతో చర్మం వాచిపోయేలా కొట్టారు. ఈ చర్యని రోడ్డు పక్కన నిలబడి ప్రజలు సినిమా చూస్తున్నట్లు చూశారే గానీ ఏ ఒక్కరూ దీని గురించి ప్రశ్నించలేదు.