: తెల్లతోలు, పిల్లికళ్లు చూసి వేల ఎకరాలు ఇచ్చేస్తారా?: చంద్రబాబుకు వైసీపీ సూటి ప్రశ్న


చైనా, జపాన్, కజకిస్థాన్, రష్యా వంటి దేశాలను చుట్టివస్తూ, చిన్న చిన్న హోటళ్లలో కూర్చొని టిష్యూ పేపర్లపై ప్లాన్లు గీస్తూ, లక్షల కోట్ల రూపాయలు నవ్యాంధ్రకు పెట్టుబడులుగా వస్తాయని తప్పుడు మాటలు చెబుతూ చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైకాపా నిప్పులు చెరిగింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి, "తెల్లతోలు, పిల్లికళ్లు ఉంటే చాలు. అత్యంత విలువైన భూములను అప్పనంగా ఇచ్చేందుకు బాబు వెనుకాడటం లేదు. బందరు పోర్టుకు 2 వేల ఎకరాలు చాలని గతంలో చెప్పి, ఇప్పుడు లక్షల ఎకరాలు కావాలని అంటున్నారు. ఇవన్నీ దోచిపెట్టడానికే. తన స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు విదేశాలు చుడుతున్నారు. మోసపుచ్చే ఆయన విధానాలను ప్రజలు తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News