: అమెరికా చరిత్రలోనే హిల్లరీ గొప్ప అధ్యక్షురాలవుతుంది: ఒబామా జోస్యం


మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ పడనున్న హిల్లరీ క్లింటన్ ను ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పొగడ్తలతో ముంచెత్తారు. హిల్లరీ అమెరికా చరిత్రలోనే అధ్యక్ష అభ్యర్థిత్వానికి అత్యంత అర్హురాలైన మహిళని, గొప్ప అధ్యక్షురాలు కావడానికి ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నాయని అన్నారు. నార్త్ కరోలినాలోని చార్లొట్టీలో మంగళవారం నాడు హిల్లరీ, ఒబామాలు తొలి సంయుక్త ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ, తదుపరి ప్రెసిడెంట్ గా అమెరికన్లు హిల్లరీనే ఎంచుకుంటారని తాను భావిస్తున్నట్టు వివరించారు. ఎన్నికల్లోగా వీరిద్దరూ కలిసి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కలసి ప్రచారం చేస్తారని డెమోక్రాట్ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News