: ఫోర్బ్స్ లిస్ట్ లో షారూక్, అక్షయ్!... ‘వరల్డ్ 100 హయ్యెస్ట్ పెయిడ్ సెలెబ్రిటీ’ల్లో చోటు!


బాలీవుడ్ బాద్ షాగా వరుస హిట్లతో దూసుకెళుతున్న షారూక్ ఖాన్ ‘వరల్డ్ 100 హయ్యెస్ట్ పెయిడ్ సెలెబ్రిటీ’ల జాబితాలో చోటు సాధించాడు. ఇక బాలీవుడ్ లోనే యాక్షన్ స్టార్ గా పేరొందిన మరో అగ్ర హీరో అక్షయ్ కుమార్ కూ ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 100 మంది హయ్యెస్ట్ పెయిడ్ సెలెట్రిటీలతో కూడిన జాబితాలో ఏడాదికి 170 మిలియన్ డాలర్ల సంపాదనతో అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో 33 మిలియన్ డాలర్లతో షారూక్ 86 వ స్థానంలో ఉండగా, 31.5 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్ 94వ స్థానంలో ఉన్నాడు. గతేడాది జాబితాలో 76వ స్థానంలో ఉన్న అక్షయ్ కుమార్ ఈ ఏడాది కాస్త వెనుకబడి 94వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఇద్దరు బాలీవుడ్ యాక్టర్లకు సంబంధించి ఫోర్బ్స్ పత్రిక పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.

  • Loading...

More Telugu News