: అమెరికాకు స్మగుల్ అయిన వెయ్యేళ్ల నాటి విగ్రహాలను తిరిగి తెప్పించుకున్న జయలలిత!


తమిళనాడులోని అరియల్లూర్ జిల్లా సుత్తమాలి గ్రామంలోని వరదరాజ పెరుమాళ్ దేవాలయం నుంచి దొంగిలింపబడ్డ రెండు అత్యంత పురాతన పంచలోహ విగ్రహాలు, అమెరికాకు స్మగుల్ కాగా, జయలలిత సర్కారు వాటిని తిరిగి వెనక్కు తెప్పించుకోగలిగింది. ఈ విగ్రహాలు సుమారు 1000 సంవత్సరాల నాటివని, ఈ భూదేవీ, చక్రత్తాళ్వార్ విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 11.75 కోట్లని తెలుస్తోంది. "న్యూయార్క్ లోని అధికారులు రెండు పంచలోహ విగ్రహాలను మాకు ఇచ్చారు. వీటిని ఎనిమిదేళ్ల క్రితం కళాఖండాల స్మగ్లర్ సుభాష్ కపూర్ యూఎస్ కు చేర్చినట్టు భావిస్తున్నాం" అని తమిళనాడు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి ప్రధాని మోదీ, అమెరికా పర్యటనలో ఆయనకు ఈ విగ్రహాలను అమెరికా స్వాధీనం చేసిందని, త్వరలోనే వీటిని కుంభకోణం కోర్టులో ప్రవేశపెట్టి, ఆలయానికి తరలిస్తామని వివరించారు. కాగా, మొత్తం ఎనిమిది విలువైన విగ్రహాలను అమెరికా తిరిగి ఇవ్వగా, ఇవి మధ్యప్రదేశ్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన చోళుల కాలం నాటి విగ్రహాలని, విచారణ జరిపి ఎక్కడి వాటిని అక్కడికి చేరుస్తామని కేంద్ర అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News