: హిందూ కాలేజీని మదారసాగా మార్చేస్తున్నారా?: సుబ్రహ్మణ్య స్వామి మండిపాటు
ఢిల్లీలోని హిందూ కాలేజీల్లో కేవలం విద్యార్థినులకు మాత్రమే హాస్టల్ ఫీజులను భారీగా పెంచడంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఘాటుగా స్పందిస్తూ మండిపడ్డారు. ఈ మేరకు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖను రాస్తూ, హిందూ కాలేజీని మదారసాగా మార్చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజీలో హాస్టల్ లో ఉండే బాలుర నుంచి రూ. 47 వేలు వసూలు చేస్తుండగా, బాలికల నుంచి రూ. 82 వేలు వసూలు చేయాలని కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసనను సైతం వ్యక్తం చేశాయి. జాతీయ మహిళా కమిషన్, ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్ సైతం ఈ వివాదంపై స్పందించాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నామని డీసీడబ్ల్యూ ప్రతినిధి వివరించారు.