: జైలు నుంచి నేడు బయటకు హార్దిక్ పటేల్!... కోర్టు షరతు ప్రకారం ఆరు నెలల పాటు రాజస్థాన్, యూపీలో మకాం!


గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఉద్యమించి అటు గుజరాత్ సర్కారుతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన యువ సంచలనం హార్దిక్ పటేల్ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. ఉద్యమం హోరెత్తిన సందర్భంగా చోటుచేసుకున్న హింసకు సంబంధించి రాజద్రోహం సహా పలు కేసులను హార్దిక్ పై నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రాజద్రోహం కేసులో బెయిల్ మంజూరైన హార్దిక్ కు తాజాగా మిగిలిన అన్ని కేసుల్లోనూ నిన్న బెయిల్ లభించింది. దీంతో దాదాపుగా 9 నెలల జైలు జీవితం తర్వాత నేడు ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. అయితే, ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఉండకూడదన్న షరతుతో కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, హార్దిక్ పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో తల దాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News