: రమ్య మృతి కేసులో శ్రావెల్ కు రెండు రోజుల పోలీస్ కస్టడీ
చిన్నారి రమ్య మృతి కేసులో నిందితుడు శ్రావెల్ కు రెండు రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. శ్రావెల్ ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 1వ తేదీన మద్యం సేవించిన బీటెక్ విద్యార్థులు పంజాగుట్ట వద్ద కారును అతివేగంగా నడిపి ప్రమాదానికి కారకులయ్యారు. ఈ సంఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్ ప్రాణాలు విడిచారు.