: దిక్కుమాలిన తాగుడు కల్చర్ ఎవరికీ అర్థం కావడం లేదు: జేసీ దివాకర్ రెడ్డి


చిన్నారి రమ్య ఘటనపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దిక్కు మాలిన తాగుడు కల్చర్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. మైనర్ విద్యార్థులు తాగుతున్నారంటే తల్లిదండ్రుల పెంపకాన్ని నిందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులకు కనీసం పదేళ్ల శిక్షకు తక్కువ కాకుండా పడాలని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనల్లో నిందితులను కోర్టులకు వదలకూడదని, డైరెక్టుగా ప్రజలకు వదలాలని ఆయన సూచించారు. ప్రజలే వారు ఎలా ఉండాలనేది నిర్ణయిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసుల్లో న్యాయవాదులు నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోకూడదని ఆయన సూచించారు. అన్నెంపున్నెం ఎరుగని బాలిక అకారణంగా మృతి చెందిందంటే దానికి ఎవరిని నిందించాలని ఆయన అడిగారు. ఇందులో తల్లిదండ్రులు, మద్యం బార్ యజమాని, విద్యార్థులు అందరూ దోషులేనని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News