: విడిపోతే ఏమవుతుందోననే సమైక్యాంధ్ర ఉద్యమం... ఇప్పుడు భయం లేదంటున్న టీజీ వెంకటేష్


ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏం జరుగుతుందోనన్న భయంతోనే తాను సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించానని, తనకు ఇప్పుడా భయం ఎంతమాత్రమూ లేదని తెలుగుదేశం నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తో కలసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు సినిమా సీన్ల వంటివని, వాటిని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడిక రెండు రాష్ట్రాలూ ముందడుగు వేస్తున్నాయని తెలిపారు. ఈటెల మాట్లాడుతూ, తెలంగాణలోని అందరి సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో మరింతగా రాణించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి సి. లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News