: జకీర్ నాయక్ పై ఆంక్షలు షురూ!... ‘పీస్ టీవీ’ ప్రసారాలను నిలిపేసిన బంగ్లాదేశ్!


ఇస్లామిక్ మత బోధనల పేరిట విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ పై ఆంక్షలు మొదలయ్యాయి. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదులను జకీర్ నాయక్ ప్రభావితం చేశారన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబై కేంద్రంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు ‘పీస్ టీవీ’ ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు చేరుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ప్రసంగాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బంగ్లాదేశ్ ఈ టీవీపై నిన్న నిషేధం విధించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలపై నిన్న జరిగిన కీలక భేటీలో ఆ దేశ కేంద్ర కేబినెట్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News