: మల్టీ ప్లెక్స్ లో నేను సినిమాలు చూడను: సినీ మాటల రచయిత హరనాథరావు
మల్టీ ప్లెక్స్ ల్లో సినిమాలు చూసేందుకు తాను ఇష్టపడనని ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను అన్ని రకాల సినిమాలు చూస్తుంటాను. మల్లీప్లెక్స్ లలో మాత్రం సినిమా చూడను. ఎందుకంటే, అక్కడ నవ్వడం, స్పందించడమనేవి కొంచెం కృత్రిమంగా ఉంటాయి. అందుకని, మామూలు థియేటర్లలోనే సినిమాలు చూస్తాను. అట్లాంటి చోట చూస్తేనే ప్రేక్షకుల పల్స్ మనకు తెలుస్తుంది. మనం రాసే మాటలకు బెంచ్ లో కూర్చునే వాళ్లు నవ్వాలి. అప్పుడే వాటి స్పందన తెలుస్తుంది’ అని హరనాథరావు అన్నారు.