: ఢిల్లీలో జోక్ వేయాలన్నా భయం పుడుతోంది: మనోహర్ పారికర్
ఢిల్లీ ప్రజల్లో సెన్సాఫ్ హ్యూమర్ తగ్గిపోయిందని, ఏదైనా జోక్ వేయాలన్నా భయం పుడుతోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్వించేందుకు ఏదైనా చెప్పినా, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. గోవా ఇంజనీరింగ్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పారికర్ మాట్లాడుతూ, "గోవాలో ఉంటేనే బాగుంటుంది. ఇక్కడున్న సమయంలో జోక్స్ వేస్తుంటాను. అదే ఢిల్లీలో అయితే భయపడతాను. ఎందుకంటే, జోకేస్తే అది ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ సృష్టించి తప్పుడు అర్థాల్లో వెళుతోంది" అని అన్నారు. జోక్ లు వేస్తే వాటిల్లోనూ వివాదాలను వెతుకుతున్నారని ఆరోపించారు. కాగా, గతంలో ఓ ప్రైవేటు చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.