: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.20 వేలు.. ప్రభుత్వ నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.20 వేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.18వేలు ఉండాలని ఏడో పే కమిషన్ ప్రతిపాదించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. మినిమమ్ శాలరీ రూ.26 వేలు ఉండాల్సిందేనని యూనియన్లు డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కాగా యూనియన్లు డిమాండ్ చేస్తున్న రూ.26వేలు వేతనం ఇవ్వడం సాధ్యం కాదని భావిస్తున్న ప్రభుత్వం వేతన కమిటీ సిఫార్సు చేసిన రూ.18వేలకు మరో రెండు వేల రూపాయలు కలిపి రూ.20వేలు చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ విషయంలో మరోమారు ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.