: సాధికార సర్వేకు సాంకేతిక సమస్యలు... రోజంతా పనిచేసినా 717 కుటుంబాల సమాచారమే నమోదైంది!
చంద్రబాబు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. సర్వే వివరాలు నమోదు చేయాల్సిన ట్యాబ్ లలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో సమాచార సేకరణ అరకొరగానే సాగింది. దాదాపు 23 వేల బృందాలు, లక్షకు పైగా ట్యాబులతో సర్వేకు దిగితే, కేవలం 716 కుటుంబాల సమాచారమే నమోదైంది. సిబ్బందికి ట్యాబ్ లపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, నెట్ వర్క్ సమస్యలే ప్రధాన అడ్డంకులని అధికారులు తెలిపారు. తదుపరి రెండు మూడు రోజుల్లో సమస్యలు సద్దుమణుగుతాయని భావిస్తున్నట్టు వివరించారు. కాగా, ఆదివారం కూడా సర్వే కొనసాగించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం అందరూ ఇళ్ల వద్ద ఉంటారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో కుటుంబం సర్వేకు గంట సమయం పడుతోందని, ఒక బృందం రోజుకు 10 కుటుంబాల సర్వే కన్నా ఎక్కువ చేయలేదని చెబుతున్నారు.