: 'సుల్తాన్' హీరో, దర్శకుడు, నిర్మాతపై 20 కోట్ల చీటింగ్ కేసు
'సుల్తాన్' సినిమా వివాదంలో చిక్కుకుంది. 'సుల్తాన్' సినిమా తన జీవిత కథ ఆధారంగా తీశారని పేర్కొంటూ బీహార్ కు చెందిన సబీర్ అన్సారీ అనే వ్యక్తి సీజేఎం కోర్టులో కేసు పెట్టారు. ముజాఫర్ పూర్ కి చెందిన సబీర్ అన్సారీ తన జీవిత కథతో సినిమా కోసం పలు సందర్భాల్లో సల్మాన్ తనను సంప్రదించారని అన్నారు. తన జీవిత కథతో సినిమా తీసినందుకుగాను 20 కోట్ల రూపాయలు ఇస్తామని, సినిమా విడుదలైన తరువాత కూడా కొంత మొత్తం ఇస్తామని చెప్పారని ఆయన ఆరోపించారు. తరువాత కొన్ని రోజులకు తన కథతో సినిమా తీయడం లేదని చెప్పారని, తీరా చూస్తే తన కథ ఆధారంగా 'సుల్తాన్' సినిమా రూపొందించారని ఆయన తెలిపారు. దీంతో సీజేఎం కోర్టులో 'సుల్తాన్' హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత్ యశ్ రాజ్ ఫిల్మ్స్, దర్శకుడు అలీ అబ్బాస్ పై ఛీటింగ్ కేసు నమోదు చేశారు.