: ఆ చెట్లు మనుషుల్ని చంపేస్తాయంటే నమ్మగలరా?... కానీ ఇది నిజం!


చెట్లు మనుషుల్ని చంపేస్తాయంటే నమ్మగలమా?... పచ్చగా, ఆహ్లాదకరకంగా చూడముచ్చటగా ఉన్న చెట్లు మనుషుల ప్రాణాలు హరిస్తాయంటే నమ్మశక్యం కాదు. కానీ లండన్ లోని బొటానికల్ గార్డెన్ కు వెళ్లి, ఓ మొక్కను తెంపి ఇది నిజమా? కాదా? అని తెలుసుకునేలోపే మన ప్రాణాలు పోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐదువందల ఏళ్ల క్రితం ఇటలీలోని పాదువా గార్డెన్‌ లో విషపూరితమైన ఔషధ మొక్కలు పెంచేవారని బోటనీ చదువుకున్న వారికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి బొటానికల్‌ గార్డెన్. దీనిని స్పూర్తిగా తీసుకునే లండన్ లోని ఆల్నివిక్‌ గార్డెన్‌ లో ఆకుపచ్చని విషాన్ని పెంచిపోషిస్తున్నారు. కెన్నాబీస్‌, కోకాలాంటి అత్యంత విషపూరితమైన మొక్కలు ఇక్కడ ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ విషపూరితమైన మొక్కలన్నింటికీ ప్రత్యేకమైన ఫెన్సింగ్‌ లు ఏర్పాటు చేసి పెంచుతున్నారు. చిత్రవిచిత్రమైన వృక్షజాతులు, అననుకూల వాతావరణంలో సైతం రాక్షసంగా పెరిగిపోయే జాతుల్ని చూడాలంటే ఇంగ్లాండ్ రావల్సిందేనని ఈ బొటానికల్ గార్డెన్ నిర్వాహకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News