: విజయవాడ శనీశ్వర ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
విజయవాడలోని శనీశ్వర ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఈరోజు ఆ ఆలయం వద్దకు రావడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈవో సూర్యకుమారిని శనీశ్వర ఆలయ కమిటీ, భక్తులు అడ్డుకుని వెనుదిరిగేలా చేశారు. శనీశ్వర ఆలయ వివాద అంశంపై ప్రస్తుతం హైకోర్టు స్టే ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదంటూ ఈవోతో ఆలయ కమిటీ, భక్తులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఈవో సూర్యకుమారి అక్కడి నుంచి తిరిగివెళ్లిపోయారు.