: మహిళా కమిషన్ తాఖీదులను బేఖాతరు చేసిన సల్మాన్!
సుల్తాన్ సినిమా షూటింగులో స్టంట్స్ చేస్తున్న సమయంలో అత్యాచారానికి గురైన మహిళ పడే వేదనను తానూ అనుభవించానంటూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులను బేఖాతరు చేస్తూ, తాజాగా విచారణకు హాజరుకాలేదు. సల్మాన్ ఖాన్ తన ముందు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. కమిషన్ ముందు నిన్న హాజరుకావాల్సి ఉన్న సల్మాన్... కేవలం ఓ లేఖను మాత్రం పంపాడట. ప్రస్తుతం ఈ లేఖను పరిశీలిస్తున్న కమిషన్ అతడిపై కఠిన చర్యలకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. అయితే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై మాత్రం జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా కుమారమంగళం నోరు విప్పడం లేదు.