: అరెస్ట్... బెయిల్ పై విడుదల... వెంటనే మళ్లీ అరెస్ట్!: చెవిరెడ్డికి షాకిచ్చిన చిత్తూరు ఖాకీలు!


వైసీపీ కీలక నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఆయన సొంత జిల్లా పోలీసులు కొద్దిసేపటి క్రితం షాకిచ్చారు. జిల్లాలోని వడమాలపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో నిన్న అరెస్టైన ఆయన కొద్దిసేపటి క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే చెవిరెడ్డి సబ్ జైలు నుంచి వెలుపలికి రాకముందే గేటు బయట అప్పటికే సిద్ధంగా ఉన్న ఎంఆర్ పల్లి పోలీసులు వెంటనే ఆయనను మరోమారు అరెస్ట్ చేశారు. తమ పోలీస్ స్టేషన్ లో నమోదైన మరో కేసులో ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి అనుచరులు అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో జైలు గేటు బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News