: వృత్తి: రాజకీయం... హోదా: ముఖ్యమంత్రి... వార్షికాదాయం: రూ.36 లక్షలు!: స్మార్ట్ పల్స్ సర్వేలో వివరాలు చెప్పిన చంద్రబాబు


ఏపీ సర్కారు నిన్న ప్రారంభించిన స్మార్ట్ పల్స్ సర్వే... సీఎం నారా చంద్రబాబునాయుడి వివరాల సేకరణతోనే ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ లో ఉంటున్న చంద్రబాబు వద్దకు వివరాల సేకరణకు నిన్న ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికార యంత్రాంగంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు వేసిన అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సవివరంగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇంటిలో తాను, తన కుమారుడు లోకేశ్ మాత్రమే ఉన్నామని, మిగిలిన వారి వివరాలను తర్వాత తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సర్వేలో అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు కింది విధంగా సమాధానాలు చెప్పారు. ఆధార్ కార్డు నెంబరు: 300300688099 నివాసం : ఆర్సీసీ శ్లాబ్ (ప్రభుత్వ క్వార్టర్) విస్తీర్ణం : 5 వేల చదరపు అడుగులు శాశ్వత నివాసం ఉందా?: లేదు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు: ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్ తదితరాలన్నీ పెళ్లైందా?.. పెళ్లి నాటికి వయసు: అయ్యింది. 30 ఏళ్లు చదువు : ఎంఏ (ఆర్థిక శాస్త్రం) ఎక్కడ: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగం: లేదు వృత్తి : రాజకీయం ప్రస్తుత హోదా : ముఖ్యమంత్రి వార్షికాదాయం: రూ.36 లక్షలు

  • Loading...

More Telugu News