: పత్రికా విలేకరులూ, మీకొద్దా చెట్లు?: సీఎం కేసీఆర్


రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చే హరితహారం కార్యక్రమానికి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా, అద్భుతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని, అందుకోసం అందరూ పట్టుపట్టాలని.. పట్టుపడతామనే వాళ్లు పిడికిలి బిగించి చేయి పైకెత్తాలని కేసీఆర్ అనడం, ప్రజలు ఆ విధంగా చేయడం జరిగింది. అయితే, ఈ సభకు హాజరైన పత్రికా విలేకరులు పిడికిలి బిగించి తమ చేతులు పైకెత్తకపోవడంతో వెంటనే స్పందించిన కేసీఆర్ ‘పత్రికా విలేకరులు! మీరు పట్టరా? మీకొద్దా చెట్లు?’ అంటూ కేసీఆర్ తనదైన శైలిలో అనడంతో వారు కూడా తమ మద్దతు తెలియజేశారు.

  • Loading...

More Telugu News