: మమ్మీలు, శిల్పాలను లారీలతో ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఐసిస్


తమ దాడులతో మారణకాండ సృష్టించే ఐఎస్ ఉగ్రవాదులు సిరియాలోని పల్మిరా నగరంలోని శిల్పాలు, మమ్మీలను ధ్వంసం చేసి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. వాటిని ధ్వంసం చేసేందుకుగాను లారీలను ఉపయోగించారు. ఇందుకు సంబంధించి ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోపై డైలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఐఎస్ ఉగ్రవాదులు ధ్వంసం చేసిన వాటిలో యూనెస్కో జాబితాలో ఉన్న నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. పల్మిరా నగరంలోని మ్యూజియంలో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి మరీ నాశనం చేశారని తెలిపింది. ఉగ్రవాదులు కూల్చివేసిన వాటిలో పురాతమైన రోమన్ 'ఏంఫీ థియేటర్' కూడా ఉందని, మే 2015లో ఈ దురాగతాలకు పాల్పడిన ఐఎస్ వాటిని ధ్వంసం చేసేందుకు పేలుడు పదార్థాలను కూడా వినియోగించిందని డైలీ మెయిల్ తెలిపింది.

  • Loading...

More Telugu News