: మంగళూరు డిప్యూటీ ఎస్పీ ఆత్మహత్య
ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ పోలీసు అధికారి తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన కర్నాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి (51) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఇంటర్వ్యూ ముగిసిన గంట సేపటి తర్వాత గణపతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడగ్ జిల్లాలోని మడికెరి టౌన్ లో ఉన్న ఒక లాడ్జి గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని నిన్న సాయంత్రం తన ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనా స్థలంలో గణపతి సూసైడ్ నోట్ లభించిందని, అందులో తనను వేధిస్తున్న ఇద్దరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గణపతి ఆత్మహత్యకు పాల్పడటానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.