: కాంగ్రెస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టిన కేంద్రమంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్


టెలికాం శాఖ‌లో ఎంతో అవినీతి జ‌రుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల చేసిన ఆరోప‌ణ‌ల ప‌ట్ల కేంద్ర‌మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈరోజు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న‌ తిప్పికొట్టారు. తాము ఎంతో చిత్త‌శుద్ధితో విధులు నిర్వ‌హిస్తున్నామ‌ని టెలికాం శాఖలో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేదని ఆయ‌న ఉద్ఘాటించారు. తాము కేంద్రంలో పాల‌న‌లోకి వ‌చ్చిన రెండేళ్ల‌లో టెలికాం శాఖ‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. తమ ఆధ్వ‌ర్యంలో టెలికాం శాఖలో సంతృప్తిక‌ర ప‌ని జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. ప‌నుల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించిన‌ తీరుపై గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. టెలికాం శాఖ ప‌నితీరు ఎంతో పార‌ద‌ర్శ‌కంగా కొన‌సాగింద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News