: సరోజనీదేవి ఆసుపత్రి ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం
హైదరాబాద్ సరోజనీదేవి కంటి ఆసుపత్రిలో 13 మంది రోగుల చూపు మందగించిన ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈనెల 21 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సరోజనీదేవి ఆసుపత్రి సుపరింటెండెంట్‌కి ఆదేశాలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యలు ఏ మాత్రం తీసుకోకుండా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సరోజనీదేవి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న రోగుల పరిస్థితిలో ఇంతవరకు మెరుగుదల ఏ మాత్రం లేనట్టు సమాచారం.