: శ్రీవారికి ఆర్ఎస్ బ్ర‌ద‌ర్స్ సంస్థ భారీ విరాళం


తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న‌కి ఈరోజు భారీ విరాళం అందింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖ వ‌స్త్ర వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్ శ్రీ‌వారికి రూ.1.20 కోట్ల విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన డీడీల‌ను టీడీడీ అధ్య‌క్షుడు చద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి అందించారు. సంస్థ అందించిన విరాళంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి రూపాయ‌లు ఉప‌యోగించ‌నున్నారు. ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు ఉప‌యోగిస్తారు. తాము ప్రతీ ఏడాది తిరుమల వేంకటేశ్వరస్వామికి కోటి రూపాయ‌ల‌కు పైగా విరాళాన్ని అందిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News